The Best story taught by my mom when i was five_no_english_version_available
అనగ అనగా ఒక ఈగ..... ఈగకు వున్నదొక ఇల్లు ...... !!!
ఇల్లు అల్లుకుంటూ అల్లుకుంటూ తన పేరు మర్చిపోయిందా ఈగ !!!
వెంటనే పక్కన చెట్టును నరికే వడ్రంగి దగ్గరికెళ్ళి ...
... వడ్రంగి... వడ్రంగి ... నా పేరేంటి ???
పొద్దునుంచి చెట్టును కొట్టి కొట్టి అలసి పోయాను ... నీ పేరు చెప్పే ఓపిక నాకు లేదు ... నా చేతలోని గొడ్డలిని అడుగు ....!!!!
... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి... నా పేరేంటి ???
పొద్దునుంచి...ఒకటే దుంగలను చీల్చుతున్నాను ... నీ పేరు నాకు తెలీదు ... నేను చీల్చే దుంగను అడుగు... ..
... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి...గొడ్డలి నరికే దుంగ ... నా పేరేంటి ???
నన్ను నిలువునా చీల్చుతున్నారని నేను ఏడుస్తూ ఉంటే మద్యలో నీ గోల ఏంటి .... నీ పేరు నాకు తెలియదు .... ఈ పక్కనే వున్న చెట్టును అడుగు .......
... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి...గొడ్డలి నరికే దుంగ ... దుంగ చెప్పిన చెట్టా నా పేరేంటి ???
ఇవాళ ఆ చెట్టును కొడుతున్నారు ... రేపు నన్నెక్కడ కొడుతారో అని నేను భయపడుతుంటే ..... నీ పేరు నేను ఎక్కడ చెప్పను !!!! ఇక్కడ కట్టేసిన గుర్రాన్ని అడుగు !!!!
... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి...గొడ్డలి నరికే దుంగ ... దుంగ చెప్పిన చెట్టా ... చెట్టుకు కట్టేసిన.. గుర్రమా ... నా పేరేంటి ???
పొద్దునుంచి... కట్టేసి వున్నారు అని చిరాకు పడుతుంటే ... నీ పేరు చెప్పటం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా .... నా కడుపులో పెరుగుతున్న పిల్లను అడుగు...... !!!
... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి...గొడ్డలి నరికే దుంగ ... దుంగ చెప్పిన చెట్టా ... చెట్టుకు కట్టేసిన.. గుర్రమా ... గుర్రం కడుపులో పెరిగే పిల్లా .... నా పేరేంటి ???
అప్పుడు ఆ గుర్రప్పిల్ల .... సకిలించింది(నవ్వుతు) " హి హి హి " అని .....
అప్పుడు ఈగకు గుర్తొచ్చి నాట్యం చేసింది !!!
... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి...గొడ్డలి నరికే దుంగ ... దుంగ చెప్పిన చెట్టా ... చెట్టుకు కట్టేసిన.. గుర్రమా ... గుర్రం కడుపులో పెరిగే పిల్లా!!! పిల్ల చెప్పిన పేరా !!!! నా అందాల పేరా ....... నా పేరు ... ఈగ... ఈగ... ఈగ... ఈగ....
Comments
Post a Comment