The Best story taught by my mom when i was five_no_english_version_available

అనగ అనగా ఒక ఈగ..... ఈగకు వున్నదొక ఇల్లు ...... !!! ఇల్లు అల్లుకుంటూ అల్లుకుంటూ తన పేరు మర్చిపోయిందా ఈగ !!! వెంటనే పక్కన చెట్టును నరికే వడ్రంగి దగ్గరికెళ్ళి ... ... వడ్రంగి... వడ్రంగి ... నా పేరేంటి ??? పొద్దునుంచి చెట్టును కొట్టి కొట్టి అలసి పోయాను ... నీ పేరు చెప్పే ఓపిక నాకు లేదు ... నా చేతలోని గొడ్డలిని అడుగు ....!!!! ... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి... నా పేరేంటి ??? పొద్దునుంచి...ఒకటే దుంగలను చీల్చుతున్నాను ... నీ పేరు నాకు తెలీదు ... నేను చీల్చే దుంగను అడుగు... .. ... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి...గొడ్డలి నరికే దుంగ ... నా పేరేంటి ??? నన్ను నిలువునా చీల్చుతున్నారని నేను ఏడుస్తూ ఉంటే మద్యలో నీ గోల ఏంటి .... నీ పేరు నాకు తెలియదు .... ఈ పక్కనే వున్న చెట్టును అడుగు ....... ... చెట్టును కొట్టే వడ్రంగి.... వడ్రంగి చేతలో గొడ్డలి...గొడ్డలి నరికే దుంగ ... దుంగ చెప్పిన చెట్టా నా పేరేంటి ??? ఇవాళ ఆ చెట్టును కొ...