HANUMAN CHALISA (హనుమాన్ చాలీసా)
ఆపదా మపహర్తారమ్ దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం !!!!!!!!!
హనుమన్ అంజనా సూనుహు వాయుపుత్రో మహాబలః ..... రామేశ్చః ఫల్గుణ శతః పింగాక్షో అమిత విక్రమః !
ఉదదిక్రమన శ్సైవా సీతా శోక వినాశకః ... లక్ష్మణ ప్రాణ దాతాచ దశ గ్రీవశ్య దర్పః ...ఆఆఆఆఆఆఆ !
ద్వాదశీ ఐతాని నామాని కపీంద్రస్య మహాత్మనః .. స్వాపకాలే పతే నిత్యమ్ యాత్రా కాలే విశేషతః !
దశ్య మృత్యు భయం నాస్తి ..... సర్వత్ర విజయీ భవేచ ..... ఆఆఆఆఆఆఆ !!!!!!
.
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు ....
బుద్ధి హీనతను కలిగిన తనువులు ... బుద్బుదములనే తెలుపు సత్యములు ... !!!!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు ....
బుద్ధి హీనతను కలిగిన తనువులు ... బుద్బుదములనే తెలుపు సత్యములు ... !!!!!!
.
.
జయ హనుమంత జ్ఞాన గుణ వందిత ... జయ పండిత త్రిలోక పూజిత
రామ దూత అతులిత బలధామ .. అంజనీ పుత్ర పవన సుత నామ
ఉదయ భానుని మధుర ఫలమని .. భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ వీరాజిత వేష .. కుండలా మండిత కుంచిత కేశ..... !!!!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి .. రాజ పదవి సుగ్రీవున నిలిపి
జానకి పతి ముద్రిక దోడ్కొని .. జలధి లంకించి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి .. వికట రూపమున లంకను గాల్చి
భీమ రూపమున అశురుల జంపిన .. రామకార్యమును సఫలము జేసిన !!!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
సీత జాడ గని వచ్చిన నిను గని .. శ్రీ రఘువీరుడు కౌగిట నిను గొని
సహస్ర రీతుల నిను గొనియాడగా .. కాగల కార్యము నీపయ్ నిడగ
వానర సేనతో వారిధి దాటి .. లంకేశునితో తలపడి కోరి
హోరు హోరు న పోరు సాగిన ... అశుర సేనల వరుసన గూల్చిన !!!!.
.
.
. శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
లక్ష్మణ మూర్చతో రాముడడలగా .. సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్ర దాటికి.. అశుర వీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీ రామ బాణము.. జరిపించెను రావణ సంహారము
ఎదిరి లేని ఆ లంకా పురమున.. ఏలికగా విభీషను జేసిన !!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
సీతారాములు నగవుల గనిరి .. ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశ్రువులే.. అయోధ్యాపురి పొంగి పొరలే
సీతారాముల సుందర మందిరం .. శ్రీ కాశు పదం నీ హృదయం
రామ చరిత కన్నామృతా గాన .. రామనామ రసామ్రుతాపాన !!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
దుర్గమమగు ఏ కార్యమైనా .. సుగమమే యగు నీ కృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న .. తొలగు భయములు నీ రక్షణయున్న
రామద్వారపు కాపరి వైన .. నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకిని ఘాకిని .. భయపడి పారు నీ నామ జపము విని
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
ధ్వజాభి రాజ వజ్ర శరీర .. భుజ బల తేజ గధాధర
ఈశ్వరాంచ సంభూత పవిత్ర .. కేశరీ పుత్ర పావన గాత్ర
శనకాదులు బ్రహ్మాది దేవతలు.. శారద నారద ఆది శేషులు
యమ కుబేర దిక్పాలురు కవులు .. పులకితు లైరి నీ కీర్తి గానమున !!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
సోదర భరత సమానాయని .. శ్రీ రాముడు ఎన్నిక గొన్న హనుమ
సాదుల పాలిట ఇంద్రుడవన్న .. అశురుల పాలిట కాలుడవన్న
అష్ట సిద్ధి నవ నిధులకు దాతగా .. జానకీ మాత దీవెంచెను గా
రామరసామృత పానము జేసిన .. మృత్యుంజయుడి వై వెలసినా !!!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
నీ నామ భజన శ్రీ రామ రంజన.. జన్మ జన్మాంతర దుఖః భంజన
ఎచ్చటున్డిన రఘువర దాసు .. చివరకు రాముని చేరుట దెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు .. స్థిరముగ మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీ రామకీర్తన .. అందందున హనుమాను నర్తన !!!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
శ్రద్దగా దీనిని ఆలకింపుమా .. శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగ గానము సేయగా .. ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా
తులసి దాస హనుమాను చాలీసా.. తెలుగున సులువుగ నలువురు పాడగా
పలికిన సీతా రాముని పలుకున .. దోషములున్న మన్నింపుమన్న !!!!
.
.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... !!!!!
.
.
మంగళ హారతి గొను హనుమంత .. సీతా రామా లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలువో అంతా ... నీవే అంతా శ్రీ హనుమంత .. ఆఆఆఆఆఆఆఆ!!!!!!!!!!
.
.
ఓం శాంతి శాంతి శాంతి హి !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Comments
Post a Comment