Sri Anjaneyam..The power of god..(శ్రీ ఆంజనేయo) HANUMAN DANDAKAM




 శ్రీ ఆంజనేయo

                                                            మనోజవం మారుత తుల్య వేగం
                                                            జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
                                                            వాతాత్మజం వానర యోధ ముక్యం
                                                            శ్రీ రామ  దూతం శిరసా  నమామి!!!

శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభా దివ్య కాయం ప్ర కీర్తి ప్రదాయం భజే  వాయు పుత్రం భజే వాళ గాత్రం భజే హం పవిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మ  తేజం బటంచున్ , ప్రభాతంబు సాయంత్రంమ్ము  నీదు సంకీర్తనల్ చేసి , నీ రూపు  వర్ణించి , నీ మీద నే దండకం బొక్కటిన్ చేయ నూహించి, నీ మూర్తినిన్ కావించి , నీ సుందరం బెంచి నీ దాస దాసున్దనే   రామ భక్తుండనే , నిన్ను నే కొల్చెధన్ , నీ కటాక్షం బునన్ చూసితే , వేడుకల్ చేసితే , నా మొరాలించితే నన్ను రక్షించితే , దయా శీలివై  చూసితే , దాతవై మ్రోచితే , దగ్గరం నిల్చితే ...

తొల్లి సుగ్రీవుకిన్ మంత్రివై , శ్రీ రామ సౌ మిత్రులన్  చూసి, వారిన్ విచారించి, శర్వేసు పూజించి యబ్భాను జుంబన్టు గావించి యవ్వాలిన్ జంపి , కాకుత్స తిలకుం  దయా ద్రుష్టి వీక్షించి ,  కిష్కింధ కేతెంచి ,  శ్రీ  రామ కార్యర్తమై  , లంకకేతెంచియున్ , లంకిణిన్ జంపియున్ ,  లంకయున్  కాల్చియున్ , భూమిజన్ జూచి ఆనంద ముప్పొంగ ఆ ఉంగరం ఇచ్చి, యా  రత్నమున్ దెచ్చి,  శ్రీ రాము కున్నిచ్చి , సంతోషితున్ జేసి , సుగ్రీవునిన్ , అంగదున్ , జాంబవంతాది నీలాదులన్ గూడి యా   సేతువున్ దాటి  వానరల్ మూకలయ్ దయ్ త్రులన్ దున్చగాన్ , రావణున్  డంత  కాలాగ్ని యుగ్రుండడయ్ కోరి , బ్రహ్మాన్డ మైనట్టి  ఆ  శక్తినిన్  వేసి యా లక్ష్మణున్ మూర్చనోన్దిపగాన్  అప్పుడే బోయి  సంజీవినిన్ దెచ్చి,  సౌమిత్రు కున్నిచ్చి ప్రాణంబు రక్షింప గాన్ , కుంభ కర్ణాది వీరాళి తో పోరి చండాడి శ్రీ రామ బాణాగ్ని  వారందరిన్ రావణున్  జంపగాన్ ,  నంత లోకంబు లానంద మై యుండ , నవ్వేలలన్ నవ్విభీశనున్ వేడుకన్దేచ్చి , శ్రీ రాముకున్నిచ్చి ,అయోధ్యకున్ వచ్చి పట్టాభిశేకంభు సంరంభమై  వున్న నీ కన్నా నా కేవ్వరున్ కూర్మిమ్ లేరంచు మన్నించితే , శ్రీ రామ భక్తి ప్రశస్తంబుగాన్ , నిన్ను నీ నామ సంకీర్తనల్ జేసితే , పాపముల్ బాయవే , భయముల్ దీరవే , భాగ్యముల్ కలుగవే , సకల సామ్రాజ్యముల్ ,  సకల సంపత్తులన్ కలుగవే .....  

వానరాకార ,  యో భక్త మందార , యో పుణ్య సంచార , యో వీర ,  యో ధీర, నీవే  సమస్తంబు ,  నీవే మహా  ఫలమ్ముగా  వెలసి , యా తారక బ్రహ్మ మంత్రంబు పటించుచున్ , స్థిరమ్ముగాన్ వజ్ర దేహంబునన్ దాల్చి , శ్రీ రామ శ్రీ రామా యంచున్ మన్హ పూతమై , ఎప్పుడున్ తప్పకన్ ,  తల తునా జిహ్వ యందుండి , నీ దీర్గ దేహంబు , ట్రైలోక్య సంచారివయ్ , రామ నామాంకిత ధ్యానివై , బ్రహ్మ తేజంబునన్ , రౌద్ర  నీజ్వాల కల్లోల , మహా వీర  హనుమంత , ఓం కార , హ్రీంకార  శబ్దంబులన్ జుట్టి , నెలన్ బడన్ కొట్టి , నీ ముష్టి ఘాతంబులన్, బాహు దండంబులన్ , రోమ ఖండంబులన్ ద్రుంచి , కాలాగ్ని రుద్రుండవై , బ్రహ్మ ప్రభా భాసితంబైన నీ  దివ్య తేజంబునన్ జూచి , రారా నా ముద్దు  నరసింహ యంచున్  దయా ద్రుష్టి వీక్షించి , నన్నేలు  నా  స్వామి సదా  బ్రహ్మచారి ....నమస్తే!! ....నమస్తే!! ....నమస్తే!! వాయుపుత్ర.....  ....నమస్తే!! ....నమస్తే!! ....నమస్తే!! నమో నమః !!!!!!!!
     
                                                 ఆపదా మపహర్తారమ్ దాతారం సర్వ సంపదాం
                                                  లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం !!!!!!!!!


                                                 

Comments

Post a Comment

Popular posts from this blog

Ansible for Devops

python in liunx

All About Amazon Web Services(AWS)